ఏలూరు పోలీసుల వినూత్న ప్రదర్శన
ELR: మామూలుగా పోలీసులు దొంగల ఫోటోలను పోలీస్ స్టేషన్‌లో లేదా పబ్లిక్ ప్రదేశాలలో ప్రదర్శిస్తారు. కానీ ఏలూరు పోలీసులు వినూత్న రీతిలో ప్రదర్శన చేపట్టారు. పాత నేరస్థుల ఫోటోలతో ఇంటి దొంగని, బైక్ దొంగని, చైను దొంగని అంటు ఊరంతా ఫ్లెక్సీలు వేశారు. దీంతో దొంగలను సులువుగా గుర్తుపట్టవచ్చు. ఈ ఫ్లెక్సీని చూసిన స్థానిక జనం పోలీసుల ఐడియా అదుర్స్ అంటు ప్రశంసలు కురింపించారు.