నిండు ప్రాణాన్ని కాపాడిన అభిమానం

వనపర్తి పట్టణం పీర్లగుట్టకు చెందిన రమేష్ సోమవారం టిఫిన్ చేసిన తర్వాత అస్వస్థతకు గురయ్యాడు. కుటుంబసభ్యులు మరణించారని భావించి అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు. తన వీరాభిమాని చనిపోయాడని తెలియడంతో మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి చివరి చూపులకు వచ్చారు. పూలమాలలు వేస్తుండగా రమేష్ ఊపిరి పీలుస్తున్నట్లు గమనించారు. వెంటనే ఆసుపత్రికి తరలించగా, గంట చికిత్స అనంతరం అతను కళ్లు తెరిచాడు.