అదుపుతప్పి కారు బోల్తా

అదుపుతప్పి కారు బోల్తా

ప్రకాశం: కురిచేడులోని దర్శి రోడ్డులో ఆదివారం కారు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో కారు డ్రైవర్ నాసరయ్యకు తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు దర్శి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రమాదం గురించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.