'రామన్నపేట ప్రభుత్వ ఆస్పత్రిని వంద పడకలుగా మార్చాలి'
BHNG: రామన్నపేట ప్రభుత్వ ఆస్పత్రిని వంద పడకలుగా మార్చి అసెంబ్లీ సమావేశాల్లో రూ.40 కోట్లు నిధుల కేటాయించి పరిసర ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలని CPM రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు ఎండీ జహంగీర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. CPM మండల కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన నిరవధిక నిరాహార దీక్షలు సోమవారం స్థానిక ప్రభుత్వాసుపత్రి గేటు ముందు ప్రారంభించారు.