గ్రామీణ ఎన్నికలపై అవగాహన కల్పించిన ఎస్పీ
MBNR: గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా శనివారం ఎస్పీ డీ.జానకి భూత్పూర్ మండలంలోని పోతులమడుగు, అన్నాసాగర్, తాటికొండ గ్రామాల్లో ప్రజలకు శాంతిభద్రతలు, చట్టపరమైన నియమాలపై అవగాహన కల్పించారు. బెదిరింపులు, డబ్బు పంపిణీ, మద్యం సరఫరా వంటి చర్యలు చట్టవిరుద్ధమని ఆమె తెలిపారు. మహిళల భద్రత కోసం ప్రత్యేక పహారా బృందాలు సిద్ధంగా ఉన్నాయని ఎస్పీ చెప్పారు.