అనిమెలలో కొనసాగుతున్న విగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమాలు
KDP: అనిమెల గ్రామంలోని భద్రకాళి సమేత వీరభద్రస్వామి విగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమాలు గురువారం కూడా కొనసాగాయి. సంగమేశ్వర ఆలయ ప్రధాన అర్చకులు సుబ్రహ్మణ్య స్వామి ఆధ్వర్యంలో వేద పండితులు గణపతిపూజ, గోపూజ, యాగశాల ప్రవేశం, జలాధివాసం, కలశారాధన తదితర కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో అన్నప్రసాద వితరణ కార్యక్రమం ఏర్పాటు చేశారు.