పి. గన్నవరం సొసైటీ ఛైర్మన్‌గా ఫణీంద్రరావు నియామకం

కోనసీమ: పి. గన్నవరం మండలం నాగుల్లంక సొసైటీ ఛైర్మన్‌గా జనసేన పార్టీకి చెందిన పాలూరి ఫణీంద్రరావు నియమితులయ్యారు. ఆయన ప్రస్తుతం నాగుల్లంక జనసేన పార్టీ గ్రామ శాఖ అధ్యక్షునిగా పనిచేస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులకు సొసైటీ ద్వారా మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తానని అన్నారు. సొసైటీ ద్వారా రైతులకు రుణాలు అందించి వారి అండగా నిలుస్తానన్నారు.