బాధిత కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే

బాధిత కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే

SKLM: కొత్తూరు మండలం మెట్టూరు గ్రామానికి చెందిన మచ్చ తిరుపతిరావు హైదరాబాదులో ఉపాధి పని చేస్తూ ప్రమాదవశాత్తు గోడకూలి మరణించారు. ఈ విషయాన్ని తెలుసుకున్న ఎమ్మెల్యే మామిడి గోవిందరావు గురువారం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఆయనతో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు పరామర్శించిన వారిలో ఉన్నారు.