తెనాలిలో యోగా సాధకుల ఆత్మీయ సమ్మేళనం
GNTR: అంజనేయం ధ్యాన యోగ మండలి ఆధ్వర్యంలో 400 ఉచిత శిబిరాల నిర్వహణ సందర్భంగా పూర్వ యోగ సాధకుల సమ్మేళనం ఆదివారం మారీసుపేట శివాలయ కళ్యాణ మండపంలో జరిగింది. ఈ సందర్భంగా యోగ సాధకులు కిషోర్ గురూజీని ఘనంగా సత్కరించారు. యోగ సాధకులకు సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. యోగా వల్ల కలిగే ప్రయోజనాలను అతిథులు వివరించి, ధ్యాన మండలి సేవలను కొనియాడారు.