'ఎమ్మెల్యేపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి'
E.G: రామాలయం పేరుతో ప్రజలను మోసం చేస్తూ, విద్వేషాలు రెచ్చగొడుతున్న ఉండి ఎమ్మెల్యే, డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణం రాజుపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని CPI జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు జువ్వల రాంబాబు డిమాండ్ చేశారు. ఇవాళ నిడదవోలులో ఆయన మాట్లాడుతూ.. రాజ్యాంగబద్ధంగా ఎన్నికైన రఘురామ కృష్ణం రాజు బలహీన వర్గాలపై అధికారాన్ని అడ్డుపెట్టుకొని జులుం ప్రదర్శించటం తీవ్ర అభ్యంతరకరమన్నారు.