పేకాట శిబిరంపై పోలీసులు దాడి
KKD: జగ్గంపేటలోని జగనన్న కాలనీలో రహస్యంగా నిర్వహిస్తున్న పేకాట శిబిరంపై ఎస్సై రఘునాథరావు సిబ్బందితో దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో నలుగురు పేకాట రాయుళ్లను అదుపులోకి తీసుకుని రూ. 5100 నగదు స్వాధీనం చేసుకున్నారు. వీరిపై కేసు నమోదు చేసి రేపు ఉదయం కోర్టుకు హాజరు పరచడం జరుగుతుందని తెలిపారు.