నేటి నుంచి వార్డు సభ్యులకు శిక్షణ
NZB: మోపాల్ మండల కేంద్రంలోని రైతు వేదికలో ఏప్రిల్ 6 నుంచి 10 వరకు 11 గ్రామ పంచాయతీల వార్డు సభ్యులకు శిక్షణ తరగతులు నిర్వహించనున్నట్లు ఎంపీడీవో రాములు నాయక్ తెలిపారు. మొత్తం 96 మంది సభ్యులకు ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు అవగాహన కల్పిస్తారు. వార్డు సభ్యులందరూ తప్పనిసరిగా హాజరయ్యేలా చూడాలని పంచాయతీ కార్యదర్శులను ఆదేశించారు.