వాటర్ ట్యాంక్లో పడి కార్మికుడి మృతి

HYD: తాండూర్ మండలం కరన్ కోట్ గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్లో పడి మ్యాతరి లక్ష్మప్ప (45) గ్రామపంచాయతీ కార్మికుడి మృతి చెందాడు. ట్యాంకు శుభ్రం చేసేందుకు వెళ్లి ఊపిరాడక మృతి చెంది ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు కరన్ కోర్ట్ ఎస్ఐ విటల్ రెడ్డి తెలపారు.