'కొత్త డిజిటల్ రేషన్ కార్డులు.. అనేక తప్పులు'

'కొత్త డిజిటల్ రేషన్ కార్డులు.. అనేక తప్పులు'

ఏలూరు: జిల్లాలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన కొత్త డిజిటల్ రేషన్ కార్డులలో అనేక తప్పులు దొర్లాయి. కొన్ని కార్డులలో తండ్రీ, కొడుకులు ఒకే సంవత్సరంలో పుట్టినట్లు ముద్రించారు. అలాగే 36 సంవత్సరాల వయసు ఉన్నవారికి 9 సంవత్సరాలుగా నమోదు చేశారు. కుటుంబంలోని అందరి వయసుల్లో ఇలాంటి తప్పులు చోటు చేసుకోవడంపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.