‘నిర్ణీత ధరలకే ఎరువులు, విత్తనాలు విక్రయించాలి'

‘నిర్ణీత ధరలకే ఎరువులు, విత్తనాలు విక్రయించాలి'

అన్నమయ్య: నిర్ణీత ధరలకే ఎరువులు, విత్తనాలు విక్రయాలు జరపాలని పీలేరు వ్యవసాయ శాఖ ఏడీఏ రమణా రావు సూచించారు. శనివారం మండల వ్యవసాయ అధికారిణి ప్రేమలతతో కలసి పెద్దతిప్ప సముద్రంలోని పలు ఎరువుల దుకాణాలను తనిఖీ చేశారు. స్టాకు నిల్వ, విక్రయాలు, కొనుగోళ్లకు సంబందించిన రికార్డులు, రిజిస్టర్లను పరిశీలించారు.