పీడిత వర్గాల అభ్యున్నతికి సురవరం కృషి: కేసీఆర్

TG: సీపీఐ సీనియర్ నేత సురవరం సుధాకర్ రెడ్డి మృతికి మాజీ సీఎం కేసీఆర్ సంతాపం తెలియజేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో సురవరంతో తనకున్న అనుబంధాన్ని స్మరించుకున్నారు. పీడిత వర్గాల అభ్యున్నతి కోసం సురవరం కృషి చేశారని అన్నారు. మార్కిస్ట్ ప్రజానేతగా పేరు సంపాదించుకున్నారని కొనియాడారు.