బాలిక కుటుంబానికి రూ.25 లక్షలు ఇవ్వాలి: ఎంపీ
KDP: మదనపల్లెలో ఓ కామాంధుడు పొట్టన పెట్టుకున్న ఏడేళ్ల చిన్నారి కుటుంబానికి రూ. 25 లక్షల ఎక్స్ గ్రేషియాను ప్రభుత్వం ఇవ్వాలని రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి డిమాండ్ చేశారు. గురువారం కొండామరిపల్లిలో ఆయన మాట్లాడారు. మదనపల్లెలో అమానుష ఘటన జరిగినందుకు బాధితులకు అండగా నిలబడి, నిరసన చేసిన వారిపై కేసులు నమోదు చేయడం చాలా బాధాకరమన్నారు.