గుడ్లవల్లేరులో ఆటో డ్రైవర్ల నిరసన

కృష్ణా: గుడ్లవల్లేరు మండలం ఓం జీసస్ అల్లా ఆటో డ్రైవర్స్ యూనియన్ నాయకులు శుక్రవారం గుడ్లవల్లేరు సెంటర్లో నిరసన చేపట్టారు. ఉచిత బస్సు పథకం వల్ల లక్షలాదిమంది ఆటో డ్రైవర్లు ఉపాధి కోల్పోయారని, తమ కుటుంబాలు రోడ్డున పడ్డారని వాపోయారు. ఈ సందర్భంగా ఆటో ర్యాలీ నిర్వహించి తమ సమస్యలపై ఎమ్మార్వోకి వినతి పత్రాన్ని అందజేశారు.