VIDEO: శ్రీమల్లికార్జున స్వామి దర్శించుకున్న ఎర్రబెల్లి
WGL: వర్ధన్నపేట మండలం కట్ర్యాల గ్రామంలోని శ్రీ మల్లికార్జున స్వామి జాతరను పురస్కరించుకుని శుక్రవారం మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి ఆశీస్సులు పొందారు. ఆయనతో పాటు బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.