తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
TPT: తిరుమలలో సోమవారం భక్తుల రద్దీ కొనసాగుతోంది. దీంతో 12 కంపార్ట్‌మెంట్లు నిండాయి. టోకెన్లు లేని భక్తులకు సర్వదర్శనం పూర్తి కావడానికి సుమారు 8 గంటలు పడుతుందని టీటీడీ తెలిపింది. నిన్న 75,343 మంది దర్శించుకోగా, 26,505 మంది తలనీలాలు సమర్పించారు. హుండీ ఆదాయం రూ.3.69 కోట్లు వచ్చింది. చలి ఉన్నప్పటికీ రద్దీ తగ్గకపోవడంతో అధికారులు అదనపు ఏర్పాట్లు చేస్తున్నారు.