'ప్రణాళికాబద్ధంగా పెండింగ్ భూ సేకరణ పూర్తి చేయాలి'

KMM: నీటిపారుదల ప్రాజెక్టులు సకాలంలో పూర్తి చేసేందుకు ప్రణాళికాబద్ధంగా పెండింగ్ భూ సేకరణ పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డి అన్నారు. బుధవారం కలెక్టరేట్లో కల్లూరు డివిజన్ సబ్ కలెక్టర్ అజయ్ యాదవ్‌తో నీటి పారుదల ప్రాజెక్టుల భూ సేకరణపై సమీక్షించారు. సీతారామ ఎత్తిపోతల పథకంలో వివిధ ప్యాకేజీలలో ఇప్పటి వరకు 1964 ఎకరాల భూ సేకరణ పూర్తి చేశామన్నారు.