బస్సు ప్రమాదం.. భారీగా పెరిగిన మృతుల సంఖ్య
బంగ్లాదేశ్‌లో జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో మృతి చెందిన వారి సంఖ్య 18కి చేరింది. ఈ ఘటనలో మరో 35 మంది గల్లంతయ్యారు. ప్రమాదవశాత్తు ప్రయాణికులతో వెళ్తున్న బస్సు దౌలత్‌దియా ఘాట్ వద్ద పడ్మా నదిలో పడింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాలను వెలికి తీస్తున్నారు. గల్లంతైన వారి కోసం గాలిస్తున్నారు. ఈ ఘటనలో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.