ఆసుపత్రుల్లో పోషకాహార పునరావాస కేంద్రాలు ఏర్పాటు
ASR: జాతీయ ఆరోగ్య మిషన్ కింద ఆసుపత్రుల్లో పోషకాహార పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ తెలిపారు. అల్లూరి జిల్లాలో అరకు ఏరియా ఆసుపత్రి, ముంచంగిపుట్టు, చింతపల్లి సీహెచ్ సీలలో 10పడకలతోనూ, అడ్డతీగల, వై.రామవరం సీహెచ్ సీలలో 5పడకలతోనూ ఏర్పాటు చేస్తామన్నారు. వీటి ద్వారా ఐదేళ్లలోపు చిన్నారులకు వైద్యం అందిస్తారని పేర్కొన్నారు.