నేడు డయల్ యువర్ డీఎం
ప్రకాశం: ప్రయాణికుల రవాణా కష్టాలను తెలుసుకునేందుకు పొదిలి డిపో కార్యాలయంలో మంగళవారం డయల్ యువర్ డీఎం కార్యక్రమం నిర్వహించనున్నట్లు డిపో మేనేజర్ శంకరరావు తెలిపారు. ప్రయాణికులు సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల వరకు ఈ కార్యక్రమం ఉంటుందన్నారు. నంబర్ 99592 25700కు ఫోన్ చేసి సమస్యలు తెలిపి, సలహాలు ఇవ్వాలని ఆయన కోరారు.