మే 1 నుండి వేసవి క్రీడా శిక్షణ

Mncl: మే 1వ తేదీ నుంచి మంచిర్యాల జిల్లాలోనీ 10 మండలాల్లో వేసవి క్రీడా శిక్షణ శిబిరాలు నిర్వహిస్తున్నట్లు జిల్లా యువజన, క్రీడల శాఖ అధికారి కీర్తి రాజవీరు తెలిపారు. ఈ శిబిరాల ద్వారా గ్రామీణ క్రీడాకారులను రాష్ట్ర, జాతీయ స్థాయి క్రీడాకారులుగా తీర్చిదిద్దనున్నట్లు పేర్కొన్నారు.