ఘనంగా తొలి ఉపముఖ్యమంత్రి జన్మదిన వేడుకలు
JN: జఫర్గడ్ మండల కేంద్రంలోని గాంధీ సెంటర్‌లో సోమవారం తెలంగాణ తొలి ఉప ముఖ్యమంత్రి తాటికొండ రాజయ్య జన్మదిన వేడుకలను BRS టౌన్ అధ్యక్షుడు శ్రీధర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. BRS నేతలు కేక్ కట్ చేసి..రాజయ్యకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం శ్రీధర్ మాట్లాడుతూ.. రాబోయే రోజుల్లో రాజయ్య ఉన్నత పదవులు పొంది.. ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు.