సీతారాంపురంలో ఘనంగా రాములోరి కళ్యాణం
BDK: శ్రీరామనవమిని పురస్కరించుకుని దుమ్ముగూడెం మండలం సీతారాంపురం గ్రామంలో సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు. పూజా కార్యక్రమాలు, హారతులు, మంగళవాయిద్యాల మధ్య ఉత్సవం ఘనంగా జరిగింది. ఈ వేడుకలకు భక్తి శ్రద్ధలతో గ్రామస్థులు, భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఆధ్యాత్మిక, రామనామ స్మరణతో ఆలయం మార్మోగింది.