VIDEO: కలలో దర్శనం.. వెలుగులోకి విగ్రహం
JGL: వెల్గటూర్ మండలం స్థంబంపల్లి గ్రామంలో సంచలనం చోటుచేసుకుంది. గుట్టపై పుట్టలో చిన్న బంగారు నాగదేవత విగ్రహం వెలుగులోకి వచ్చింది. ఎల్లమ్మ తల్లి కలలో దర్శనమిచ్చినట్లు గ్రామస్తులు చెబుతున్నారు. పూజల అనంతరం విగ్రహం బయటపడడంతో భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఆలయం నిర్మించేందుకు గ్రామస్తులు సిద్ధమయ్యారు.