ప్రపంచకప్ ఫైనల్‌కు ప్రముఖుల హాజరు
నవీ ముంబై వేదికగా భారత్-సౌతాఫ్రికా మహిళల జట్ల మధ్య జరుగుతున్న ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్‌కు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఈ కీలక పోరును వీక్షించడానికి ఐసీసీ ఛైర్మెన్ జైషా, క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్, ఐపీఎల్ ఛైర్మెన్ అరుణ్ ధుమాల్, రోహిత్ శర్మ, రిలయన్స్ ఫౌండేషన్ ఛైర్‌పర్సన్ నీతా అంబానీ స్వయంగా స్టేడియానికి తరలివచ్చి ఆటగాళ్లకు తమ మద్దతు తెలియజేశారు.