శ్రీ కోదండ రామచంద్రస్వామి వార్షికోత్సవాలు

శ్రీ కోదండ రామచంద్రస్వామి వార్షికోత్సవాలు

SRPT: మోతె మండలం మామిళ్లగూడెంలోని శ్రీ కోదండ రామచంద్ర స్వామి దేవాలయ వార్షికోత్సవ సందర్భంగా శనివారం స్వామివారికి కళ్యాణాన్ని పూజారులు శాస్త్రోక్తంగా జరిపారు. భక్తులు స్వామివారి కళ్యాణాన్ని కన్నులపండుగగా వీక్షించారు. అనంతరం భక్తిశ్రద్ధలతో స్వామివారిని దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.