VIDEO: అపరిశుభ్రతకు నిలయంగా రైతు వేదిక

VIDEO: అపరిశుభ్రతకు నిలయంగా రైతు వేదిక

BHPL: రేగొండ (M) కేంద్రంలోని రైతు వేదిక పరిసరాలు చెత్తాచెదారంతో నిండిపోయాయి. తిని పడేసిన ఎంగిలి ప్లేట్లు, ప్లాస్టిక్ పేరుకుపోవడంతో ఆ ప్రాంతమంతా తీవ్ర దుర్వాసన వ్యాప్తి చెందుతోంది. ఇక్కడికి వచ్చే రైతులు అసౌకర్యానికి గురవుతున్నారు. అధికారుల పర్యవేక్షణ లోపంతోనే ఈ పరిస్థితి ఏర్పడిందని స్థానికులు మండిపడుతున్నారు. వెంటనే చెత్త తొలగించాలని స్థానికులు డిమాండ్ చేశారు.