హాస్టల్ వసతి లేక విద్యార్థుల అవస్థలు

VKB: ప్రభుత్వ ఆదర్శ పాఠశాలల్లో హాస్టల్ వసతి లేక విద్యార్థినులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. బషీరాబాద్ మండలంలో రూ.1.28కోట్లతో హాస్టల్ భవన నిర్మాణ పనులు పూర్తి చేసి టీఎస్ఈడబ్ల్యూడీసీ అధికారులు జిల్లా విద్యాశాఖకు అప్పగించారు. భవనం అందుబాటులోకి వచ్చి మూడేళ్లు గడిచినా హాస్టల్ ప్రారంభించలేదు. వసతి సౌకార్యం లేక రోజూ పాఠశాలకు 3కి.మీ కాలినడకన వచ్చి వెళ్తున్నారు.