'అటవీ ప్రాంతంలో వృద్ధుడి మృతదేహం లభ్యం'

'అటవీ ప్రాంతంలో వృద్ధుడి మృతదేహం లభ్యం'

తిరుపతి: సత్యవేడు మండలం అలిమేలు మంగాపురం కమ్మోళ్లమెట్ట అడవి ప్రాంతంలో గుర్తుతెలియని వృద్ధుని మృతదేహం లభ్యమైంది. బుధవారం స్థానికులు ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించి, మంగాపురంపురం పంచాయతీ అధికారులకు అప్పగించారు. కాగా గ్రామసర్పంచ్ శిరీష ఆధ్వర్యంలో మృతదేహాన్ని అడవి ప్రాంతంలోనే పూడ్చి దహన సంస్కారాలు జరిపారు.