'మలేరియా నియంత్రణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి'

'మలేరియా నియంత్రణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి'

ప్రకాశం: గ్రామాల్లో మలేరియా నియంత్రణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని డాక్టర్ నాగరాజు అన్నారు. ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా జరుగుమల్లి మండలంలోని కామేపల్లిలో శనివారం ఆరోగ్య సిబ్బంది ర్యాలీ నిర్వహించి అవగాహన కల్పించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచినప్పుడే మలేరియా వంటి వ్యాధులు సోకకుండా ఆరోగ్యంగా ఉంటామని నాగరాజు అన్నారు.