వైరల్ ఫీవర్‌తో విద్యార్థి మృతి

వైరల్ ఫీవర్‌తో విద్యార్థి మృతి

NDL: కొలిమిగుండ్లలోని అంకిరెడ్డిపల్లిలో వైరల్ ఫీవర్ సోకి విద్యార్థిని మృతి చెందిన విషాదకర ఘటన శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన తలారి రాజు, రామాంజినమ్మ దంపతుల కుమార్తె పద్మిని(9) నాలుగో తరగతి చదువుతోంది. వారం రోజులుగా వైరల్ ఫీవర్, కామెర్లతో బాధపడుతూ కోలుకోలేక మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు వాపోయారు. MEO అబ్దుల్ సంతాపం వ్యక్తం చేశారు.