VIDEO: హైదరాబాద్‌కు అదిలాబాద్ ఆదివాసీలు

VIDEO: హైదరాబాద్‌కు అదిలాబాద్ ఆదివాసీలు

HYD: ఆదిలాబాద్ జిల్లాకు చెందిన 250 మంది ఆదివాసీలు తొలిసారి హైదరాబాద్ సందర్శనకు బయలుదేరారు. ఉట్నూరులో మంత్రి జూపల్లి కృష్ణారావు 7 ప్రత్యేక బస్సులను ప్రారంభించారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా వీరు విమానాశ్రయం, చార్మినార్, గోల్కొండ, శిల్పారామం వంటి పర్యాటక ప్రాంతాలను సందర్శించనున్నారు. తెలంగాణ పర్యాటక శాఖ ఈ వినూత్న కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది.