VIDEO: ఘనంగా దత్త జయంతి వేడుకలు

VIDEO: ఘనంగా దత్త జయంతి వేడుకలు

SRPT: తుంగతుర్తి మండలం దేవునిగుట్ట తండా ఎక్స్ రోడ్డు వద్ద సాయిబాబా ఆలయంలో గురువారం దత్త జయంతి వేడుకలను భక్తులు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. సాయిబాబాకు భక్తులు అభిషేకాలు, అర్చనలు ప్రత్యేక పూజ కార్యక్రమాలు చేపట్టారు. అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తలు బాలాజీ నాయక్, సాయిబాబా భక్తులు పాల్గొన్నారు.