VIDEO: రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన జర్నలిస్ట్ ఆగయ్య

VIDEO: రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన జర్నలిస్ట్ ఆగయ్య

హనుమకొండ: జిల్లా ధర్మసాగర్ మండల కేంద్రం సమీపంలోని రింగ్ రోడ్డు వద్ద నేడు జరిగిన రోడ్డు ప్రమాదంలో పెసరు ఆగయ్య అనే జర్నలిస్టు తీవ్రంగా గాయపడ్డారు. ధర్మసాగర్ మండలం క్యాతంపల్లి గ్రామానికి చెందిన ఆగయ్య రింగ్ రోడ్డు ప్రధాన రహదారి దాటుతుండగా లారీ ఢీకొనడంతో తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు.