గిరిజన చట్టాలపై అభిప్రాయాలు సేకరణ

PPM: జీవో నెంబర్ 3పై గిరిజనుల అభిప్రాయాలను సేకరించి రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించడం జరుగుతుందని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ సంచాలకులు ఎస్.భార్గవి పేర్కొన్నారు. జీవో 3 గిరిజన చట్టాలపై అభిప్రాయాలు, సలహాలు, సూచనలపై వర్కు షాప్ కార్యక్రమం గురువారం స్థానిక గిరిజన మిత్ర సమావేశ మందిరంలో గిరిజన సంఘాలు, ఉపాధ్యాయులు, న్యాయవాదులు గిరిజన ప్రతినిధులతో నిర్వహించారు.