నేడు రేపల్లెలో పర్యటించనున్న మంత్రులు

నేడు రేపల్లెలో పర్యటించనున్న మంత్రులు

BPT: రేపల్లె నియోజకవర్గంలో ఇవాళ మంత్రులు అనగాని సత్యప్రసాద్, కొలుసు పార్థసారథి అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారని మంత్రి కార్యాలయ వర్గాలు తెలిపారు. పెనుమూడి నుంచి లంకెవాని దిబ్బ వరకు రూ.10.20 కోట్లతో నిర్మించనున్న ఆర్‌అండ్‌బి రోడ్డు శంకుస్థాపనలో పాల్గొంటారు. లంకెవాని దిబ్బ గ్రామంలో యానాదుల సామాజిక సభా మందిరం ప్రారంభోత్సవంలో కూడా హాజరవుతారు.