'మహిళలు తలుచుకుంటే సాధించలేనిది ఏదీ లేదు'
MHBD: మహిళలు తలుచుకుంటే సాధించలేనిది ఏదీ లేదని మున్సిపల్ ఛైర్‌పర్సన్ జ్యోతి రమేష్ అన్నారు. మహబూబాబాద్‌లో నాలుగు రోజులపాటు నిర్వహించిన గార్మెంట్స్ కటింగ్ శిక్షణ పూర్తి చేసుకున్న మహిళలకు మున్సిపల్ ఛైర్‌పర్సన్ సర్టిఫికెట్లను అందజేశారు. మహిళలు వంటింటికే పరిమితం కాకుండా స్వయం ఉపాధి రంగాల్లో రాణిస్తూ సమాజ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని అన్నారు.