డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో జరిమానా
VZM: డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో పట్టుబడిన ముగ్గురు వ్యక్తులకు రూ.10 వేల చొప్పున జరిమానా విధించినట్లు ఎస్సై బి.గణేష్ వెల్లడించారు. నెల్లిమర్ల పోలీసు స్టేషన్‌లో శుక్రవారం ఆయన మాట్లాడారు. నెల్లిమర్లలో ఇటీవల నిర్వహించిన వాహన తనిఖీల్లో మద్యం తాగి వాహనాలను నడుపుతూ ముగ్గురు పట్టుబడ్డారన్నారు.