తాడూరులో ఆయుర్వేద వైద్య శిబిరం

NGKL: నేషనల్ ఆయుష్ మిషన్ ఆదేశాల మేరకు తాడూర్ మండలకేంద్రంలో బుధవారం వయోవృద్ధులకు ఆయుర్వేద వైద్య శిబిరం నిర్వహించారు. ఈ వైద్య శిబిరంలో 61 మంది వృద్ధులను పరీక్షించి అవసరమైన మందులను పంపిణీచేశారు. వైద్యులు సంతోష్ అభిరామ్, సురేష్ మాట్లాడుతూ.. రోగాల బారిన పడకుండా ఆహార నియమాలలో మార్పులు చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో వైద్యులు అహ్మద్, మంజుల పాల్గొన్నారు.