VIDEO: గండి పోచమ్మ ఆలయంలోకి చేరిన గోదావరి నీరు
ASR: దేవీపట్నం మండలంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం గండి పోచమ్మ తల్లి ఆలయంలోకి గోదావరి వరద నీరు చేరింది. పోలవరం ప్రాజెక్టు గేట్లు మూసివేయడంతో ఆలయ మండపంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాలు జలమయమయ్యాయని ఈవో లక్ష్మీ కుమార్ తెలిపారు. భక్తుల భద్రత దృష్ట్యా అమ్మవారి దర్శనాలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. ఇలాంటి పరిస్థితుల్లో భక్తులెవరూ ఆలయానికి రావద్దని ఆమె కోరారు.