గుట్కా ప్యాకెట్ల పట్టివేత
NRPT: మక్తల్ మండల కేంద్రంలో ఆలంపల్లి రంగనాథ్ అనే వ్యక్తికి చెందిన కిరాణా షాపులో నిల్వ ఉంచిన రూ.31,470 విలువ గల అంబర్, జర్ధ, గుట్కా ప్యాకెట్లను టాస్క్ ఫోర్స్, మక్తల్ పోలీసులు గురువారం పట్టుకున్నారు. సమాచారం మేరకు దాడులు నిర్వహించి నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని మక్తల్ ఎస్సై భాగ్యలక్ష్మి రెడ్డి తెలిపారు.