VIDEO: షాపు నిర్వాహకుడిపై ఉపాధ్యాయుడు వీరంగం
KMM: ఖమ్మంలో తన క్రాకర్స్ షాపుకు పోటీగా దుకాణం పెట్టిన ఓ వ్యాపారిపై ప్రభుత్వ ఉపాధ్యాయుడు లక్ష్మణ్ బూతులు తిడుతూ.. దాడికి దిగారు. 'మంత్రి అండ ఉంది, షాపు తొలగించకపోతే చంపేస్తా' అంటూ బెదిరించారు. నేలకొండపల్లి మండలంలో స్కూల్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న లక్ష్మణ్..నిర్వాహకుడిపై అసభ్యకరంగా మాట్లాడి షాపు తొలగించాలని వీరంగం సృష్టించాడు.