టీచర్స్ కాలనీలో పందులు స్వైర విహారం

KDP: ఖాజీపేట టీచర్స్ కాలనీలో పందుల బెడద ఎక్కువైందని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పందుల వల్ల పరిసరాలు అపరిశుభ్రంగా మారడంతోపాటు దాడులకు పాల్పడుతున్నాయని స్థానికులు భయాందోళనకు గురౌతున్నారు. పంచాయతీ అధికారులు స్పందించి పందులను అరికట్టేలా చూడాలని.. పరిసరాల శుభ్రతకు చర్యలు తీసుకోవాలని కాలనీవాసులు కోరుతున్నారు.