నేడు పార్టీ నేతలతో వైఎస్ జగన్ సమావేశం

AP: వైసీపీ అధినేత జగన్ ఇవాళ ఉదయం 10:30 గంటలకు తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో సమావేశాన్ని నిర్వహించనున్నారు. సమావేశానికి పార్టీ పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకులు, రీజనల్ కోఆర్డినేటర్లు హాజరుకానున్నారు. రాబోయే రాజకీయ పరిస్థితులపై నేతలకు మార్గదర్శనం చేయనున్నట్లు సమాచారం. కూటమి ప్రభుత్వంపై తీవ్రమైన పోరాటానికి సిద్ధంగా ఉండాలని నేతలకు సూచించే అవకాశం ఉంది.