నేడు కడపలో మాజీ ప్రధాని విగ్రహావిష్కరణ

నేడు కడపలో మాజీ ప్రధాని విగ్రహావిష్కరణ

కడప నగరంలోని ఎర్రముక్కపల్లిలో మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారి వాజపేయి విగ్రహ ఆవిష్కరణను శనివారం మధ్యాహ్నం చేస్తున్నట్లు బీజేపీ రాష్ట్ర కార్యవర్గసభ్యులు బాలకృష్ణ యాదవ్ పేర్కొన్నారు. మాజీ ప్రధానమంత్రి దేశానికి అందించిన సేవలకు గుర్తుగా విగ్రహాన్ని నెలకొల్పుతున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు.