నేడు విద్యుత్ సరఫరా‌లో అంతరాయం

నేడు విద్యుత్ సరఫరా‌లో అంతరాయం

SRPT: నేరేడుచర్ల మండలం దిర్శించర్ల సబ్ స్టేషన్‌లో ఇవాళ మరమ్మతుల చేయనున్నారు. దీని కారణంగా దిర్శించర్ల గ్రామంలో ఇవాళ ఉదయం 8 గంటల నుంచి 11 గంటల వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడనున్నది. ఈ మేరకు నేరేడుచర్ల మండల విద్యుత్ శాఖ ఏఈ రవి వర్మ ఆదివారం రాత్రి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ అంతరాయానికి విద్యుత్ వినియోగదారులు సహకరించాలని కోరారు.